AP Police Recruitment 2023 Constables Hall Tickets Download Now Here

AP Police Recruitment 2023 Constables Hall Tickets Download Now Here AP Police Recruitment 2023: ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (SLPRB AP) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6100 కానిస్టేబుల్‌ పోస్టులున్నాయి. 

AP Police Recruitment 2023 Constables Hall Tickets Download Now Here

సివిల్‌ ఎస్సై, ఏపీఎస్సీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న, సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 2023 జనవరి 22న ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు. అయితే.. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఎస్‌ఐ ఉద్యోగాలకు మాత్రం 2023 జనవరి 18వ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఇక.. కానిస్టేబుల్‌ అభ్యర్థులు జనవరి 12 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ (లింక్‌ ఇదే) చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకుద రఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2022 నవంబరు 30
దరఖాస్తుల సమర్పణకు తుది గడువు: 2022 డిసెంబరు 28 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు
ప్రాథమిక రాత పరీక్షకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 2023 జనవరి 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: 2023 జనవరి 22

సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపిక విధానం:


మొదటి దశ:
ప్రాథమిక రాతపరీక్ష: ఒకటే పేపర్‌ 200 మార్కులకు (3 గంటల పాటు)
పరీక్షలో వచ్చే అంశాలు: ఇంగ్లిష్‌, అర్థమెటిక్‌ (10వ తరగతి స్థాయి), రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌, భారతచరిత్ర, సంస్కృతి, భారత జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన వర్తమాన అంశాలు..

రెండో దశ:
శారీరక కొలతలు, దేహదారుఢ్య పరీక్షలు: ప్రాథమిక రాతపరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారికే నిర్వహిస్తారు.

సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీపడేవారు: 1,600 మీటర్ల పరుగు తప్పనిసరిగా పూర్తిచేయాలి. లాంగ్‌జంప్‌ లేదా 100 మీటర్ల పరుగులో ఏదో ఒకటి పూర్తిచేయాలి. వీటిలో అర్హత సాధిస్తే చాలు. తుది ఎంపిక కోసం ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.

ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీపడేవారు: 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ మూడూ పూర్తిచేయాలి. ఈ మూడు విభాగాల్లో ప్రదర్శించిన ప్రతిభకు మార్కులు కేటాయిస్తారు. వీటిని తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.

మూడో దశ:
ఫైనల్‌ రాతపరీక్ష: శారీరక కొలతలు, దేహదారుఢ్య పరీక్షల్లో ఎంపికైనవారికి తుది రాతపరీక్ష నిర్వహిస్తారు. సివిల్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు 200 మార్కులకు, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

పరీక్షలో వచ్చే అంశాలు: ఆంగ్లం, అర్థమెటిక్‌ (10వతరగతి స్థాయి), రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌, భారతచరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు.

సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు తుది ఎంపిక: తుది రాతపరీక్షలో 200 మార్కులకు అత్యధిక మార్కులు పొందినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు.

ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు తుది ఎంపిక: 100 మార్కుల నిర్వహించే దేహదారుఢ్య పరీక్ష, మరో 100 మార్కులకు నిర్వహించే తుది రాతపరీక్షల్లో కలిపి మొత్తం 200 మార్కులకు ఎవరైతే అత్యధిక మార్కులు సాధిస్తారో వాళ్లే ఉద్యోగానికి సెలక్ట్‌ అవుతారు.
Share:
Copyright © AP Grama Volunteers Recruitment AP Ward Volunteers Recruitment | Powered by AP Grama Volunteers Recruitment